ఈసారి ఓటుకు నోటు కేసును వదిలే ప్రసక్తే లేదు : కెసిఆర్

0

రెండో సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఓటుకు నోటు కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమని, తగిన ట్రీట్‌మెంట్ ఇస్తామని ఆయన హెచ్చరించారు. ‘ఓటుకు నోటు’ కేసు ఇంకా ప్రాసెస్‌లోనే ఉందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఎవరెవరు ఎన్ని మేశారో కక్కిస్తామని, ఈ టర్మ్ మాత్రం ఓటుకు నోటు కేసును వదిలే ప్రసక్తే లేదని కేసీఆర్ హెచ్చరించారు. టీఆర్‌ఎస్ గెలవాల్సింది 88 సీట్లు కాదని 106 స్థానాలని ఆయన చెప్పుకొచ్చారు. చిన్నచిన్న లోపాల వల్ల కొన్ని సీట్లు కోల్పోయామని కేసీఆర్ తెలిపారు.

Post Your Comments
SHARE