ఎన్టీఆర్ బయోపిక్ : ఆడియో, ట్రైలర్ రిలీజ్ డేట్స్.

0

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ హైద‌రాబాద్‌లో… ఆడియో రిలీజ్ ఈవెంట్ నంద‌మూరి తార‌క‌రామారావు పుట్టిన ఊరు నిమ్మ‌కూరులో జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ 16న ట్రైల‌ర్ లాంచ్.. 21న ఆడియో వేడుకను గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్ర‌తీ లుక్ కూడా సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలుగా వ‌స్తుంది. జ్ఞాన‌శేఖ‌ర్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విద్యాబాల‌న్, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, రానా ద‌గ్గుపాటి, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Post Your Comments
SHARE