
ఇటీవల ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ సీఈవో పెటెలీ ఈ ఏడాది ద్వితీయార్థంలో తమ సంస్థ తదుపరి ఫ్లాగ్షిప్ మోడల్ విడుదల చేస్తామని ప్రకటించిన నేపధ్యంలో వన్‌ప్లస్ 6 మోడల్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచార౦ జరుగుతుంది. చైనాకు చెందిన ఓ టెక్నాలజీ బ్లాగ్‌లో వన్‌ప్లస్ 6కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేశారు.
దీని ప్రకారం వెనకవైపు గ్లాస్ బాడీతో రూపొందిన ఈ మొబైల్ బెజల్-లెస్ డిస్ ప్లేతో వస్తోంది. మరోవైపు ఇప్పటివరకూ వెల్లడైన వివరాల ప్రకారం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మెమొరీ ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 వెర్షన్‌తో విడుదల చేయొచ్చని భావిస్తున్నారు. గతంలో విడుదల చేసిన వన్‌ప్లస్ 5, 5టి తరహాలో ఇందులోనూ డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతోంది.
Post Your Comments