ఓటమిని అంగీకరించిన మోడీ

0
తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడ్డాయి. ఇందులో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ అధికారంలో ఉన్న బీజేపీకి చుక్కెదురైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించగా.. మధ్యప్రదేశ్‌లో మాత్రం హంగ్ ఏర్పడింది. ఇక మిజోరాంలో ఎంఎన్‌ఎఫ్ ఘన విజయం సాధించింది.
అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన.. పార్టీలకు ఆయన అభినందనలు తెలిపారు. ‘‘ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు నా అభినందనలు. తెలంగాణలో అద్భుత విజయం సాధించిన కేసీఆర్‌గారికి, మిజోరాంలో అపూర్వ విజయం సాధించిన మిజోరాం నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్)కి ప్రత్యేకంగా అభినందనలు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఇక ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నట్లు మోదీ మరో ట్వీట్ ద్వారా తెలిపారు. ‘‘ప్రజలు ఇచ్చిన తీర్పును మేము స్వీకరిస్తున్నాం. మాకు ప్రజా సేవ చేసుకొనే అవకాశాన్ని కల్పించిన ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రజలకు నా ధన్యవాదాలు. ఈ రాష్ట్రాల్లో ప్రజాసేవ చేసేందుకు బీజేపీ విరామం లేకుండా పని చేసింది’’ అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Post Your Comments
SHARE