గెలిచేసిన భారత్..!

0

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రికార్డు విజయం సొంతం చేసుకుంది టీం ఇండియా. 304 పరుగులతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కోహ్లి సేన. విదేశాల్లో భారత్ కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. అంతా ఉహించునట్లుగానే భారత్ లంక బ్యాట్స్ మెన్ ల పని పట్టింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో లంక భారత స్పిన్నర్ల ఉచ్చులో గిలగిల కొట్టుకుంది.

మొదటి నుండి ఈ టెస్టులో భారత్ పైచేయి సాధిస్తూనే వచ్చింది. మొదటి ఇన్నింగ్స్ లో ధావన్ (190) పూజార (154) పరుగులతో భారత్ భారీ స్కోర్ చేసింది. దానికి బదులుగా లంక జట్టు 291 పరుగులకే పరిమితమైంది. అయితే ఫాలోఅన్ ఆడించే అవకాశం ఉన్నా లంక జట్టుకు ఆ అవకాశం ఇవ్వలేదు కోహ్లి. వెంటనే రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కోహ్లి సేన కోహ్లి (103 నాట్ అవుట్) కి తోడు ముకుంద్ (81) పరుగులతో 240 పరుగులకు 3వికెట్ల వద్ద డిక్లేర్ చేసింది భారత్.

మొదటి ఇన్నింగ్స్ 309 పరుగుల భారీ లోటుతో కలిపి 550 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక జట్టు పోరాడుతున్నట్లే కనిపించినా భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా (3/71), రవిచంద్రన్ అశ్విన్ (3/65)ల ధాటికి 245 పరుగులకే పరిమితమైంది. అయితే చేతి వెలి గాయంతో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాట్టింగ్ కు రాని గుణరత్నె రెండో ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్ కు రాలేదు.

రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రంగన హేరాత్ కు కుడా గాయం కావడంతో బ్యాటింగ్ కు రాలేదు.దీనితో లంక జట్టు 245 పరుగులకు ఎనిమిది వికేట్లు కోల్పోయినా ఐసిసి రూల్స్ ప్రకారం గాయం అయిన వారు బ్యాటింగ్ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు , జట్టుకి వేరే అవకాశం లేనప్పుడు అల్అవుట్ గా ప్రకటిస్తారు. ఈ విధంగా లంక జట్టు 245 పరుగులకే పరిమితమయి మరో రోజు ఆట మిగిలి ఉండగానే భారీ ఓటమిని మూటగట్టుకుంది. లంక జట్టుకి ఇది మూడో భారీ ఓటమి కావడం విశేషం.

 

Post Your Comments
SHARE