మోత్కుపల్లిని లైట్ తీసుకున్న బాబు

0

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలంగాణా తెలుగుదేశం నేతల విషయంలో చూసి చూడనట్టు వదిలేసినట్టు తెలుస్తుంది. బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశంలో సీనియర్ నాయకులూ మోత్కుపల్లి హాజరు కాకపోయినా చంద్రబాబు ఆరా తీయలేదని సమాచారం.  ఎన్టీఆర్‌భవన్‌లో టీడీపీటీఎస్‌ అధ్యక్షుడు రమణ అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కార్యకర్తల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వారికి వివరించారు. తెలుగుదేశం పార్టీని.. ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసారు. పార్టీని విలీనం చేస్తామనే అధికారం మోత్కుపల్లి సహా ఎవరికీ లేదని, అలా ఎవరైనా మాట్లాడితే వారు పార్టీ వ్యతిరేకులేనని స్పష్టం చేశారు. ఒకరిద్దరు నాయకులు కుప్పిగంతులు వేసినంత మాత్రాన పార్టీకి నష్టమేమీ ఉండదని చెప్పిన చంద్రబాబు..

రాజకీయ అవసరాలను బట్టి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. టీడీపీతో పొత్తు ఉండబోదని బీజేపీ నాయకులు ఏకపక్షంగా ప్రకటించుకున్నారని, అందరితో మాట్లాడి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు సర్వ శక్తులు వడ్డాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న ఎన్నికలకు సర్వ శక్తులు వడ్డాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీ జెండా ఎగురవేయాలంటే నారా కుటుంబం నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కార్యకర్తలు నినాదాలు చేయగా.. బాబు వారించారు.

Post Your Comments
SHARE