నేను బాగా ఆడలేదు అందుకే తీసుకోలేదు

0

ఒకప్పటి టీం ఇండియా కీలక ఆటగాళ్ళలో ఇర్ఫాన్ పఠాన్ ఒకడు. తన స్వింగ్ బౌలింగ్ తో టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ నమోదు చేసి ప్రపంచ క్రికెట్ లో సంచలనం సృష్టించాడు.అయితే ఆ తర్వాత కొంత కాలంగా టీంలో కీలక ఆటగాడిగా కొనసాగిన అతను లోయర్ ఆర్డర్ నుంచి ఓపెనర్ వరకు వచ్చాడు. దీనితో అతని బౌలింగ్ గాడి తప్పి టీం లో స్థానం కోల్పోయాడు.

ఆ తర్వాత దేశవాళి క్రికెట్ లో రాణించినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఐపియల్ లో కూడా రాణించాడు. అయినా జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇటీవల జరిగిన ఐపియల్ వేలంలో కూడా ఇతగాడిని కొనుగోలు చెయ్యడానికి ఏ జట్టు ఆశక్తి చూపించలేదు. ఈ నేపధ్యంలో దీనిపై పఠాన్ స్పందించాడు.

“ఐపీఎల్‌లో న‌న్ను తీసుకోవ‌డానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అది న‌న్ను బాధించ‌లేదు. ఎందుకంటే నా గురించి నేను అంచ‌నా వేయ‌గ‌ల‌ను. ఈ ఏడాది దేశ‌వాళీ క్రికెట్‌లో నా ప్ర‌ద‌ర్శ‌న ఏమాత్రం బాగోలేదు. అలాంటపుడు న‌న్ను తీసుకోవాల‌ని ఏ ఫ్రాంచైజీ అయినా ఎందుక‌నుకుంటుంది. 2008లో ఐపీఎల్ వేరు.. ఇప్ప‌టి ఐపీఎల్ వేరు. అయినా ఈ ఐపీఎల్‌లో నేను ఆట‌గాడిగా క‌నిపించ‌క‌పోయినా.. వ్యాఖ్యాత‌గా క‌నిపిస్తా. అలాగైనా ఐపీఎల్‌లో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంద‌`ని” తనను తాను వెనుకేసుకొచ్చాడు.

Post Your Comments
SHARE