పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్న భారత ఆర్మీ

0

సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కి భారత ఆర్మీ దీటుగా జవాబు ఇస్తుంది. గత కొంతకాలంగా పాక్ ఆర్మీ సరిహద్దుల్లో భారత ఆర్మీని సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతుంది. ఈ నేపధ్యంలో భారత ఆర్మీ పాక్ అర్మీని లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇవాళ భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ రేంజర్లు హతమయ్యారు.

కాగా భారత ఆర్మీ, పాక్ రేంజర్ల మధ్య ఇప్పటికీ కాల్పులు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే ఇద్దరు పాక్ రేంజర్ల కాల్చివేతపై భారత సైన్యం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉంటె గురువారం బందిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్లో సైనికులు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరికొందరు ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం అందడంతో.. సైనికులు బందిపొరాలోని హజిన్‌ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. కాగా ఇటీవల ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.
Post Your Comments
SHARE