ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కెసిఆర్

0

 

 

 

 

తెలంగాణా ఎలక్షన్స్ ఈ మధ్య కాలం లో అటు యువత నుంచి ఇటు పెద్ద వాళ్ళ వరకు అందరూ ఆసక్తి గా తెలంగాణ ఎలక్షన్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ ఉదయం నుంచి అన్ని నియోజకవర్గాల్లో తెరాస ఆధిక్యం ప్రదర్శిస్తుంది. టీడీపీ పోటీ చేసిన అన్ని నియోజిక వర్గాల్లో వెనుకంజ ను ప్రదర్శిస్తుంది. అలాగే కాంగ్రెస్ తన కంచు కోట అయిన నల్గొండ లోనే వెనుకంజ వేయటం మహాకూటమి అతి పెద్ద ఫెయిల్యూర్ అను తెలుస్తుంది. కాంగ్రెస్ లోని మహామహులు కూడా వెనుకంజ లో ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఒకవేళ మహాకూటమి తెరాస దరిదాపుల్లోకి వచ్చినా కెసిఆర్ కు ఎంఐఎం మద్దతు కూడా ఉండటం తో కెసిఆర్ తెరాస విజయం ఖాయం గానే కనిపిస్తుంది. మరి కొడంగల్ రేవంత్ రెడ్డి పరిస్థితి అంతంత మాత్రం గానే ఉండటం కాంగ్రెస్ మరియు టీడీపీ శ్రేణులకు కొంత నిరాశను కలిగిస్తుంది.

ఈ మొత్తం పరిణామాలను పరిశీలించి ‘T24 Telugu’ ప్రతినిధుల విశ్లేషణ ప్రకారం కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని చేపట్ట బోతున్నట్టు భావిస్తోంది.

Post Your Comments
SHARE