బోయపాటి రాంచరణ్ సినిమా విషయంలో అది నిజమేనా

0

ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం రంగస్థలం ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల విడుదలకు సిద్దమైంది. ప్రస్తుతం ఇతరత్రా పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాంచరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యనున్నాడు. ఈ సినిమాను ఇప్పటికే మొదలుపెట్టారు కూడా..

ఈ నేపధ్యంలో ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో ఎవరనేది ఇంకా స్పష్టత లేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా బాలివుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ని తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే యాక్షన్ సినిమాలకు విలన్ గా పనికొచ్చే వివేక్ బోయపాటి శ్రీను లాంటి మాస్ డిరెక్టర్ తో చేస్తాడా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Post Your Comments
SHARE