భూమ్రాకు వార్నింగ్

0

గత కొంత కాలంగా టీం ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు జస్ప్రిత్ భూమ్రా. ఎలాంటి పిచ్ అయినా సరే తనదైన బౌలింగ్ శైలితో ప్రత్యర్ధులకు సింహస్వప్నంగా మారిపోయాడు. దీనితో సారధి కోహ్లి కూడా భూమ్రాని ప్రతి మ్యాచ్ కి అందుబాటులో ఉండేలా చూస్తున్నాడు. ఒకరకంగా భూమ్రా వచ్చిన తర్వాతే టీం ఇండియా బౌలింగ్ లైనప్ బలంగా తయారైంది.

ఈ నేపధ్యంలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ భూమ్రాకి వార్నింగ్ ఇచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న బుమ్రా చాలా జాగ్రత్తగా ఉండాలని, మున్ముందు కీలక పర్యటనలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకుండా జాగ్రత్త పడాలని సూచించాడు. బుమ్రా బౌలింగ్ శైలి విభన్నంగా ఉండడంతో గాయాలపాలయ్యే అవకాశం ఉందని, కాబట్టి ముఖ్యమైన సిరీస్‌లలోనే మాత్రమే బుమ్రాను ఆడించాలని అన్నాడు. అలాగే బౌలింగ్ వేసేపటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు.

Post Your Comments
SHARE