మహేష్ బాబు రియల్ శ్రీమంతుడు

0

శ్రీమంతుడు సినిమా ద్వారా ఆర్ధికంగా బలపడిన వారు తమ గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేసి తమను అంత వారిని చేసిన గ్రామాలకు తిరిగి ఇచ్చేయాలని సందేశం ద్వారా మంచి చిత్రాన్ని అందించిన మహేష్ బాబు తాను రియల్ లైఫ్ లో శ్రీమంతుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రెండు గ్రామాలను దత్తత తీసుకుని, వాటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో తన తండ్రి సొంత గ్రామం బుర్రిపాలెంను, తెలంగాణలోని కొత్తూరును ఆయన దత్తత తీసుకున్నారు.కాగా మహేశ్‌ బుర్రిపాలెంలో పాఠశాల భవనాన్ని నిర్మించారు. దీన్ని ఇవాళ ప్రారంభించారు. ఈ పాఠశాలకు కృష్ణ తల్లి ఘట్టమనేని నాగరత్నమ్మ, రాజా జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల అని పేరు పెట్టారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు హాజరయ్యారు.

Post Your Comments
SHARE