వర్మ కన్నీటి ట్వీట్

0

శ్రీదేవి మృతి విషయమై రాంగోపాల్ వర్మ ఎంతలా బాధపడి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 40 ఏళ్ళ నుంచి ఆమె ఆరాధ్య దేవతలా చూస్తున్న వర్మ ఆమె మరణంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు . ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేస్తూ తాను ఎంతగా బాధపడుతున్నానో చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి ఆయన ట్వీట్ చేసారు. శ్రీదేవి గురించి కంటతడి పెట్టించేలా ట్వీట్ చేశారు.

‘‘థియేటర్స్‌లో శ్రీదేవి అద్భుతమైన ఎనర్జీతో చేసే డ్యాన్స్‌ను, యాక్టింగ్‌ను చూసేందుకు జనం అలా కూర్చుండిపోయేవారు. అలాగే ఇప్పుడు కూడా ఆమె చుట్టూ జనం ఉన్నారు. కానీ కన్నీళ్లతో పగిలిన హృదయాలతో’’ అని వర్మ ట్వీట్ చేశారు.కాగా సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో ప్రారంభమైంది. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్ తారలతో పాటు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే ముంబైకి తరలివెళ్లారు. శ్రీదేవికి కాంచీవరం చీరలంటే చాలా ఇష్టమట. అందుకే ఆమె భౌతికకాయానికి బంగారు వర్ణంతో కూడిన కాంజీవరం చీరను కప్పి అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు.

Post Your Comments
SHARE