శ్రీదేవి భౌతికకాయం మరింత ఆలస్యం

0

వివాహం కొస౦ దుబాయ్ వెళ్లి అక్కడే తుదిశ్వాస విడిచిన ఫిమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి భౌతికకాయం భారత్మ రింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే మరణించి దాదాపు 36 గంటలు గడిచినా.. ఆమె మృతదేహం ఎప్పుడు దుబాయి నుంచి భారత్‌కు చేరుతుందనే విషయంపై ఇంకా  స్పష్టత రాలేదు. ఈ నేపధ్యంలో అక్కడి అధికారులు స్పందించారు.

ఆలస్యానికి కారణాలను భారతీయ కాన్సులేట్‌కు దుబాయి పోలీసులు వివరించారు. ఫైనల్ పోస్ట్‌మార్టన్ రిపోర్టు ఇంకా తమకు అందలేదనీ, అవి ఏ సమయానికి అందుతాయన్నదాన్ని బట్టే తరలింపు నిర్ణయం ఉంటుందని అధికారులు చెప్పారు. మరోవైపు బాయ్‌లోని అల్‌ఖసిస్ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో వుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు..

ముంబై నుంచి ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానికి చెందిన ప్రైవేట్ జెట్ దుబాయ్ వెళుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి శ్రీదేవి భౌతికకాయంతో ఈ జెట్ సోమవారం రాత్రికి ముంబైకి చేరుకుంటుందని సమాచారం. దుబాయి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు (భారత్‌లో దాదాపు 4గంటల సమయం) శ్రీదేవి మృతదేహాన్ని తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Post Your Comments
SHARE