శ్రీదేవి మృతదేహం భారత్ కి

0

ఫిమేల్ సూపర్ స్టార్ శ్రీదేవి మృతదేహాన్ని భారత్ కి తరలించడానికి గాను అక్కడి ప్రాసిక్యూషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  శ్రీదేవిది అసహజ మరణమని ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చిన నేపథ్యంలో కేసు దర్యాప్తు ప్రారంభించిన దుబాయ్‌ ప్రాసిక్యూషన్‌ మృతదేహాన్ని అప్పగించేందుకు అనుమతి తెలిపింది. ప్రాసిక్యూషన్‌ నుంచి అనుమతి రాగానే…

సంబంధిత పత్రాలను అక్కడి పోలీసులు భారత దౌత్య అధికారులు, శ్రీదేవి కుటుంబ సభ్యులకు అందజేశారు.దుబాయ్‌ పోలీసుల అనుమతి నేపథ్యంలో శ్రీదేవి పార్థివదేహాన్ని రసాయనిక శుద్ధి (ఎంబామింగ్‌) కోసం పంపించనున్నారు.దీనితో ఈరోజు రాత్రి సమయానికి శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరుకునే అవకాశముంది.

ఇప్పటికే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు శ్రీదేవికి కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో ముంబైకి చేరుకున్నారు. అన్ని కేసులలాగానే శ్రీదేవి కేసును కూడా పరిగణించినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. మృతదేహం పాడవకుండా చేపట్టే రసాయన ప్రక్రియ(ఎంబామింగ్‌)తోపాటు ఇతర ప్రక్రియలు పూర్తికావడానికి సుమారు 3-4 గంటలు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Post Your Comments
SHARE