ఎయిర్ టెల్ సూపర్ స్మార్ట్ ఫోన్స్

0

ప్రస్తుతం భారత మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ హవా కొనసాగుతుంది. ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకి పెరగడంతో వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆశక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ నెట్వర్కింగ్ దిగ్గజం ఎయిర్టెల్ కూడా స్మార్ట్ ఫోన్ రంగంపై దృష్టి సారించింది.. గూగుల్ తో ఒక ఒప్పందం చేసుకుంది.

‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమంలో భాగంగా వస్తున్న ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ గో 4జీ స్మార్ట్‌‌‌ఫోన్లు మార్చి నాటికి మార్కెట్‌ లోకి రానున్నాయి. దేశీయ స్మార్ట్‌‌ఫోన్ మేకర్లు లావా, మైక్రోమ్యాక్స్‌లు ఈ స్మార్ట్‌ఫోన్ల తొలి సెట్లను విడుదల చేయనున్నాయి. మై ఎయిర్‌టెల్, ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ తదితర ఎయిర్‌టెల్ యాప్స్‌ను ఈ ఫోన్లో ముందస్తుగా లోడ్ చేయనున్నారు. ర్యామ్ 1జీబీ అంతకంటే తక్కువ ఉండే అవకాశం ఉన్నప్పటికీ తక్కువ డేటాతో వేగంగా పనిచేసేలా వీటిని డిజైన్ చేస్తున్నారు.
Post Your Comments
SHARE