మరోసారి రక్తపుటేరులు పారించిన అమెరికా

0

మధ్య ప్రాచ్యంలో అమెరికా రెచ్చిపోయింది ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా ఆత్మ రక్షణ అంటూ 100 మంది సిరియా సైనికులను హతమార్చింది. వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్లుగా సిరియాలో ఉగ్రవాదులపై పోరు చేస్తున్న అమెరికా గతేడాది నేరుగా రంగంలోకి దిగింది. ఈ నేపధ్యంలో అక్కడి ప్రభుత్వ వ్యతిరేక వర్గాలపై అమెరికా యుద్ధం చెయ్యడం మొదలు పెట్టింది.

తాజాగా ఇదే తరహా దాడులు చేసిన అమెరికా వంద మంది సైనికులను కాల్చి చంపింది. రియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు అనుకూల సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా దాడులు చేసిందని, అందుకు ప్రతీకారంగానే తాము దాడి చేశామని అమెరికా నేతృత్వంలోని జిహాదీ వ్యతిరేక కూటమి బుధవారం ప్రకటించింది. కాగా ఈ దాడిలో వంద మంది మరణించగా మరికొంత మంది   తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

Post Your Comments
SHARE