ఎన్డియే కూటమి నుంచి మరో పార్టీ బయటకు

0

ఎన్డియే కూటమి నుంచి శివసేన బయటకు వచ్చిన నేపధ్యంలో ఉత్తరాదిన మరో పార్టీ బిజెపికి షాక్ ఇచ్చింది. బీహార్‌లో బీజేపీకి మిత్ర పక్షం హిందుస్థానీ అవామ్ మోర్చా షాక్ ఇచ్చింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఎన్డీయేతో తెగతెంపులపై కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ – ఆర్జేడీల నేతృత్వంలోని మహాకూటమిలో చేరుతున్నట్టు ప్రకటించారు.

ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వీ యాదవ్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ ప్రకటన చేశారు. దీనిపై మాట్లాడిన తేజస్వీ యాదవ్.. తమ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో మాంఝీకి మంచి అనుబంధం ఉందని.. ఇద్దరూ కలిసి గతంలో పనిచేశారన్నారు. ఎన్డీయే సర్కార్ చర్యలు దళితులకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.కాగా ఇటీవల లాలు ప్రసాద్ యాదవ్ కి అవినీతి కేసులో శిక్ష పడిన సంగతి తెలిసిందే.

Post Your Comments
SHARE