ఎట్టకేలకు మౌనం వీడిన అర్జున్ కపూర్

0

అర్జున్ కపూర్ ” బోని కపూర్ మొదటి భార్య కుమారుడు. తన తల్లి నుంచి శ్రీదేవి తన తండ్రిని దూరం చేసిందనే కారణంతో ఆమెపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసి ఆమెను వేరు చేసి చూసాడు. అలాగే శ్రీదేవి కూతుళ్ళను కూడా కలవనని పలుమార్లు చెప్పాడు. అలాగే మీడియా ఎప్పుడైనా శ్రీదేవి గురించి ప్రశ్నిస్తే ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే శ్రీదేవి మరణంతో అవేమి తనకు లేవంటూ చెప్పాడు. తన తండ్రి శ్రీదేవి మృతదేహం కోసం ఇబ్బంది పడుతున్న వేళ తన తండ్రికి సహాయంగా అక్కడకు వెళ్ళిన అర్జున్ తన తండ్రికి సహాయంగా నిలిచాడు. అయితే ఒక ఇంటర్వ్యులో తనకు శ్రీదేవి అంటే ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చాడు. అర్జున్ మాట్లాడుతూ..

‘శ్రీదేవి అంటే నాకెంతో గౌరవం అని, మా నాన్న జీవితంలోకి ఎవరొచ్చినా గౌరవిస్తానని, అలాగే శ్రీదేవిని కూడా’ అని చెప్పుకొచ్చాడు అర్జున్ కపూర్. కాగా శ్రీదేవిని చివరిసారి చూసేందుకు ఆమె నివాసం వద్ద అభిమానులు బారులు తీరారు. ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత ఇక్కడికి మృతదేహం రావడంతో కాస్త ఊపిరిపీల్చుకున్న అభిమానులు ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు సిద్దమైయ్యారు.

Post Your Comments
SHARE