పాకిస్తాన్ కి షాక్ ఇచ్చిన ఆర్టిస్ట్ లు

0

భారత్ లో పని చేస్తూ పాకిస్థానీ కళాకారులు పని చేస్తూ, భారీగా సంపాదించుకుంటున్నారని, అదే సమయంలో భారతదేశంపై ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్న పాకిస్థాన్‌ చర్యలను కానీ, ఉగ్రవాదాన్ని కానీ ఖండించడం లేదని చాలా కాలంగా ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పాక్ కి ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ షాక్ ఇచ్చింది.

పాకిస్తాన్ కళాకారులతో ఇక కలిసి పని చేసేది లేదంటూ స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి   తెలిసిందే.ఒకవైపు పాక్ సైన్యం మరోవైపు ఉగ్రవాదులు భారత అర్మీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్ పెద్ద ఎత్తున సైనికులను కోల్పోతుంది.

దీనితో దేశానికే పెద్ద పీట వేసిన ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ పాకిస్థానీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లపై నిషేధం విధించాలని తీర్మానించినట్లు పేర్కొంది. పాకిస్థాన్ వల్ల భారత సైనికులు అమరులవుతున్నారని పేర్కొంది. సినిమాలు, టీవీ సీరియళ్ళు వంటివాటిలో పాకిస్థానీ కళాకారులు, టెక్నీషియన్లతో కలిసి తాము పని చేయబోమని స్పష్టం చేసింది.

Post Your Comments
SHARE