అప్పుడు ధోని అంత అమాయకంగా ఉండేవాడా..?

0

భారత జట్టులో మీకు అవకాశం వస్తే ఏం చేస్తారు..? మీ వరకు ఎందుకు నేను అయితే వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే వదిలేసి వెళ్ళిపోతా.. డబ్బుకి డబ్బు పేరుకి పేరు వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి.. అంతే కదా..? అలాంటిది ప్రపంచ కప్ నుంచే అరంగేట్రం అంటే..? ఇంకా ఆలోచన ఎంటండి బాబు వెంటనే వెళ్ళిపోక..

కాని ధోని మాత్రం వద్దని చెప్పాడట.. అవును మీరు చదివింది నిజమే.. ధోని వద్దని చెప్పాడట.. ఈ విషయాన్నీ గంగూలీ తన ఆత్మకథలో చెప్పుకొచ్చాడు. ఈ పుస్తకంలో ధోని గురించి ఆశక్తికరమైన విషయాన్నీ చెప్పుకొచ్చాడు గంగూలీ.. 2003 ప్ర‌పంచ‌క‌ప్ కంటే ముందు నుంచే యువ ఆట‌గాళ్ల కోసం అన్వేష‌ణ ప్రారంభించా. ఒత్తిడిని జ‌యించి జట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చ‌గ‌ల ఆట‌గాళ్ల కోసం గాలిస్తున్నా.

ఆ స‌మ‌యంలో నా దృష్టిలో ధోనీ ప‌డ్డాడు. నాకు కావాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ ధోనీలో ఉన్నాయ‌నిపించాయి. దీంతో జ‌ట్టులోకి ర‌మ్మ‌ని 2003 ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలోనే ధోనీని అడిగా. `నేను ప్ర‌స్తుతం భార‌త రైల్వేస్‌లో టికెట్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నా. జ‌ట్టులోకి ఎలా వ‌చ్చేది` అని అడిగాడు. దాంతో నేను షాక‌య్యా. అయితే 2004లో నా స‌ల‌హాను ధోనీ సీరియ‌స్‌గా తీసుకున్నాడు. జ‌ట్టులోకి వ‌చ్చిన నాటి నుంచే ప్ర‌త్యేక ఆట‌గాడిగా ధోనీ గుర్తింపుతెచ్చుకున్నాడు. నేను త‌న‌పై పెట్టుకున్న న‌మ్మకాన్ని నిల‌బెట్టాడ‌`ని గంగూలీ త‌న ఆత్మ‌క‌థ‌లో పేర్కొన్నాడు.

Post Your Comments
SHARE