ఇంటిలిజెంట్‌ సినిమా రీవ్యూ.. రేటింగ్!

0

నిర్మాణ సంస్థ: సీ. కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
తారాగ‌ణం: సాయిధరమ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి, నాజర్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ఆకుల శివ, కాశీ విశ్వనాథ్‌, ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే, రాహుల్‌దేవ్‌, దేవ్‌గిల్‌, వినీత్‌కుమార్‌, జె.పి. పృథ్వీ,కాదంబరి కిరణ్‌, విద్యుల్లేఖా రామన్‌, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, భద్రం త‌దిత‌రులు
కథ, మాటలు: శివ ఆకుల
ఛాయాగ్ర‌హ‌ణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌
సంగీతం: థమన్‌
కూర్పు: గౌతంరాజు
క‌ళ‌: బ్రహ్మ కడలి
నిర్మాత: సి.కళ్యాణ్‌
క‌థ‌నం, దర్శకత్వం : వి.వి.వినాయక్‌.
రేటింగ్ : 1 / 5

ఓ పేరొందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓన‌ర్ అయిన నంద‌కిషోర్ (నాజ‌ర్‌), తేజు (సాయి ధరమ్ తేజ్)ని చేరదీసి అతని ఉన్నతికి సాయపడతాడు. అయితే నంద‌కిషోర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మంచి పేరు ప్ర‌ఖ్యాతుల‌తో ముందుకు వెళుతుండ‌డంతో అత‌డి ప్ర‌త్య‌ర్థులు కుట్ర చేసి ఆ కంపెనీని స్వాధీనం చేసుకుంటారు. ఈ క్రమంలో నందకిషోర్ హత్యకు గురవుతాడు. దీంతో ధర్మతేజ ధర్మా భాయ్‌గా పేరు మార్చుకుని త‌న స్నేహితులు(రాహుల్ రామ‌కృష్ణ‌, స‌ప్త‌గిరి, న‌ల్ల‌వేణు)ల‌తో క‌లిసి నందకిషోర్ హత్యకు కారణమైన అందరినీ తన ఇంటెలిజెన్స్‌తో చంపేస్తాడు. ఇంతకీ ఈ కథలో సంథ్య (లావణ్య త్రిఫాఠి) క్యారక్టర్ ఏంటి అనేదే మిగతా కథ.

విశ్లేషణ:
మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వివి వినాయిక్ ఇటువంటి కథ ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు కానీ తేజూ వరుస ప్లాపుల పరంపరను ఆపలేకపోయాడు. వినాయక్ సినిమాలు అనగానే యాక్షన్‌తో కూడిన కామెడీ అలరిస్తుంది. కానీ ఈ సినిమాలో రెండు మూడు సీన్స్ మినహా అన్నీ చూసేవారికి పెద్ద పరిక్షనే పెడుతాయి. ఏంటో అర్థం పర్థం లేని కథ హ్యాకింగ్‌లు అంటూ అసలు ఏం చెప్తున్నారో అస్సలు అర్థం కాదు. ఎక్కువ సేపు హ్యాకింగ్ వంటి టెక్నికల్ అంశాలు చుట్టూ కథ తిప్పడం ప్రేక్షకుడికి కుర్చీలో నుంచి పైకి లేవాలి అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏమీ లేకుండానే నడిపించిన వినాయక్ సెకండ్ హాఫ్ మాత్రం సిల్లీగా లాజిక్స్‌కి ఆమడ దూరంలో నడప హీరోని ఎలివేట్ చేయటంలో మాస్టర్ అయిన వినాయక్ ఇందులో తేజూని అలాగే ఎక్కవ చేసి చూపించాడు. అయితే తేజు పరిధికి మించి చూపించి ఇబ్బంది పెట్టాడు. ఇక ఈ సినిమా కథ, మాటల రచయిత ఆకుల శివను ఓ ప్రొపిషనల్ కిల్లర్‌గా చూపించగా ఏదో కథ అతనే రాసుకున్నాడు కాబట్టి కాస్త క్యారెక్టర్ హైప్ ఇచ్చుకున్నాడు. ఇక పాటలు గురించి చెప్పాలంటే తమన్ ఒక్క పాట కూడా సరైనది ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డబ్బా పెట్టి కొట్టినట్టే కొట్టాడు. హరీబరీగా లాగించేశాడు.

నటీనటులు:
ఉండడానికి డజను మందికి పైగా బాగా ఆరితేరిన నటీనటులే ఉన్నారు కానీ కథ లేకుండా ఎంతమందిని పెట్టుకుని లాభం ఏముంది. రెమ్యునరేషన్ కోసం నటించినట్లు ఉన్నారే తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు ఎవరివీ లేవు. సాయి ధరమ్ తేజ వరకు డాన్సులు, యాక్షన్ ఎపిసోడ్స్‌లో మెప్పించినప్పటికీ పెద్దగా చెప్పగలిగింది ఏమీ లేదు. హీరోయిన్‌గా లావ‌ణ్య త్రిపాటి నాలుగు సీన్లు, మూడు పాటలకు కాస్తంత అందం చూపించ‌డానికి తప్ప ఆమె వ‌ల్ల ఈ సినిమాకు ఏ రకంగానూ ఉపయోగపడలేదు. బ్రహ్మానందం కామెడీ మళ్ళీ బోర్ కొట్టించింది. పోసాని, పృథ్వి, రాహుల్ రామకృష్ణ వినీత్ కుమార్, రఘుబాబు, ఆకుల శివ, ఆశిష్ విద్యార్ధి, సాయాజీ షిండే, దువ్వాసి, ఫిష్ వెంకట్, వేణు, భద్రం, వెంకీ, జయప్రకాశ్ రెడ్డి, కాదంబరి కిరణ్, మహేష్ ఆచంట అందరూ తమకి క్యారెక్టర్ ఉందంటే వచ్చి చేసి వెళ్లిపోయారు అనిపిస్తుందే తప్ప వారి నటనకు తగ్గ క్యారెక్టర్లు అయితే రచయిత రాసుకోలేదు.

సాంకేతిక వర్గం:
తమన్ మ్యూజిక్ బాగా చేయలేదు. ఎడిటింగ్ ఇంకాస్త కత్తెరలు వేసుంటే జనం థ్యాంక్స్ చెప్పేవారు. విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ పర్వాలేదు. కథ, డైలాగులు ఏం రాశారో అవి దర్శకుడు, హీరో, నిర్మాతలకు ఎలా నచ్చాయో వారికే తెలియాలి. అయితే సి.కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘చమకు చమకు’ పాటను చెడగొట్టి చిరాకుపెట్టారు.

ప్లస్ పాయింట్స్‌:
చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు.

మైనస్ పాయింట్స్:
బోలెడు ఉన్నాయి

ఓవరాల్‌గా ఇంటిలిజెంట్‌ ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరిక్షే. ఇంటిలిజెంట్‌ జోలికి వెళ్లనోడే ఇంటిలిజెంట్‌.

Post Your Comments