ఉగ్రదాడి భారిగా సైనికులు మృతి

0

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఫరాహ్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు ఆర్మీ చెక్‌పాయింట్‌ వద్ద దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అఫ్గాన్‌ రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల   ప్రకారం ఈ దాడిలో దాదాపు 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అలాగే మరో 20 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటె కాబూల్ లో ఇస్లామిక్ స్టేట్ రెచ్చిపోయింది. ఆత్మాహుతి దళ సభ్యుడు కాబూల్‌లోని దౌత్య కార్యాలయాలకు సమీపంలో తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ దాడికి తామే చేశామంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. దీనితో దేశ వ్యాప్తంగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసారు.

Post Your Comments
SHARE