కిం జోంగ్ ఉన్న మరీ ఇంత కిరాతకుడా

0

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జోంగ్ ఉన్ పేరు చెప్పగానే మనకి కళ్ళల్లో ఒక నియంత కనిపిస్తాడు. అతని వికృత చేష్టలు.. అమెరికాపై యుద్ధం ఇలా ఎన్నో ఆగడాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అయితే ఆ దేశంలో కిం జోంగ్ ఉన్ ఎన్నో ఆగడాలు చేసాడు. తన మన భేదం లేకుండా చిన్న చిన్న కారణాలకే తన బంధువులను సైతం కాల్చి చంపాడు. గతేడాది అతని సోదరుడు కిం జోంగ్ నామ్ ని కూడా కిం ఇలాగే చంపించాడు.

ఒక్కసారి అతని దారుణాలు చూస్తే 

రియంగ్‌-జిన్‌: కిమ్‌ ప్రభుత్వంలో ఉన్నత శ్రేణి విద్యాశాఖ అధికారి. కిమ్‌ మాట్లాడుతున్న మీటింగ్‌లో నిద్రపోయాడని హై క్యాలిబర్‌ మిషన్‌ గన్‌తో కాల్చి చంపారు. ఈ ఘటన 2016 ఆగస్టులో జరిగింది.
హోంగ్‌ యోంగ్‌ చోయ్‌: కిమ్‌ మంత్రివర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసేవారు. కిమ్‌ మాట్లాడిన ఒక సమావేశంలో నిద్రపోయాడు. ఫలితంగా ఆ మీటింగ్‌లో సూచనలను అమలు చేయలేదు. దీంతో యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌గన్‌తో చోయ్‌ను కాల్చి చంపారు.
 జనరల్‌ జాంగ్‌ సాంగ్‌: జాంగ్‌ సాంగ్‌ కిమ్‌కు సాక్షాత్తూ అంకుల్‌. కిమ్‌కు వ్యతిరేకతను ఎగదోస్తున్నాడని ఆయనకు మరణశిక్షను విధించారు. ఆయన కుటుంబంలో చాలా మందిని హతమార్చారు.
 కిమ్‌ క్యోంగ్‌ హుయ్‌: జాంగ్‌ సతీమణి. కిమ్‌కు ఆంటీ అవుతారు. తన భర్తను కిమ్‌ హత్యచేశాడని ఆరోపించింది. దీంతో ఆమెపై విషప్రయోగం చేసి హతమార్చారు.
 ఒ సంగ్‌ హోన్‌: కిమ్‌ మంత్రివర్గంలో డిప్యూటీ ప్రజా భద్రతా మంత్రిగా పనిచేశారు. ఆయన్ను ఫ్లేమ్‌ త్రోవర్‌(నిప్పులు విరజమ్మే ఆయుధం)తో కాల్చి చంపారు.
 కిమ్‌ చోల్‌: కిమ్‌ మంత్రివర్గంలో రక్షణశాఖ ఉపమంత్రి. కిమ్‌ జొంగ్‌ ఇల్‌ సంతాప కార్యక్రమంలో తాగి గొడవ చేశాడు. దీంతో ఆయన్ను మోర్టార్‌తో కాల్చి చంపించారు.
Post Your Comments
SHARE