మనసుకు నచ్చింది రీవ్యూ.. రేటింగ్!

0

చిత్రం : మనసుకు నచ్చింది
విడుదల తేదీ: 16-02-2018
తారాగణం : సందీప్‌ కిషన్‌, అమైరా దస్తర్‌, త్రిదా చౌదరి, అదిత్‌ అరుణ్, నాజర్, బేబీ జాన్వీ
సంగీతం : రాధన్‌
సినిమాటోగ్రాఫర్: రవియాదవ్
దర్శకత్వం : మంజుల ఘట్టమనేని
నిర్మాత : సంజయ్‌ స్వరూప్‌, పి.కిరణ్‌
రేటింగ్: 1/5

మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్-అమైరా దస్తూర్ జంటగా తెరకెక్కిన చిత్రం “మనసు నచ్చింది”. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. మంజుల దర్శకురాలిగానూ సక్సెస్‌ సాధించిందా..? అనే విషయాలు తెలుసుకోవాలంటే రీవ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య (అమైరా దస్తర్‌) మంచి స్నేహితులు, వారి స్నేహాన్ని ప్రేమగా భావించిన పెద్దలు వాళ్లకు పెళ్లిచేయాలని భావిస్తారు. కానీ తమ మధ్య స్నేహం తప్ప ప్రేమ లేదని సూరజ్‌, నిత్యలు భావించి ఇంట్లో నుంచి గోవాకి పారిపోతారు. జీవితంలో ఎటువంటి గోల్స్ లేని సూరజ్ గోవాకు వెళ్లిన తర్వాత ఫోటోగ్రాఫర్‌గా కావాలని అనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో ఫెయిల్ అవుతాడు. అప్పుడు నిత్య అతని వెంట ధైర్యంగా నిలబడుతుంది. అదే సమయంలో నిత్య తమ మధ్య ఉన్నది స్నేహం కాదు.. ప్రేమ అని తెలుసుకుంటుంది. అయితే సూరజ్ గోవాలో నిక్కి (త్రిదా చౌదరి)ని ప్రేమిస్తాడు. ఆ తరువాత ఏమవుతుంది? సూరజ్ ఏమి చేసాడు? తన కెరీర్‌లో సూరజ్ సక్సెస్ అయ్యాడా ? నిత్య ప్రేమ సక్సెస్ అయిందా? సూరజ్ చివరికి ఎవరితో కలిశాడు. అనేదే మిగిలిన చిత్ర కథ.

విశ్లేషణ :
మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా చేసిన తొలి ప్రయత్నం పెద్దగా ఆకట్టుకోలేదు. ట్రై యాంగిల్ లవ్‌స్టోరీని ప్రకృతికి జోడించి ముడిపెట్టిన కథ పెద్దగా ఆకట్టుకోలేదు. కథలో కొత్తదనం లేకపోవటం కథనం కూడా నెమ్మదిగా సాగటం కాస్త ఇబ్బంది పెట్టింది. సినిమాలో ఆకట్టుకునే ఒకే ఒక్క విషయం సినిమాటోగ్రఫి, ప్రకృతి అందాలను వెండితెర మీద చాలా అందంగా చూపించారు ప్రతీ ఫ్రేము రిచ్‌గా కనిపిస్తుంది. రాధన్ సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటులు :
సందీప్‌ కిషన్‌ ఎప్పటిలాగే ఇంతకుముందు సినిమాలలో మాదిరిగానే నటించాడు. అయితే ఎమోషనల్‌ సీన్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్‌ అమైర దస్తర్‌ మాత్రం తన అందంతో మెప్పించింది. నటన పరంగానూ పరవాలేదని అనిపించింది. మరో హీరోయిన్‌గా నటించిన త్రిదా చౌదరి పూర్తిగా గ్లామర్‌ షోకే పరిమితం అయింది. అయితే ప్రియదర్శిని మాత్రం సరిగ్గా వాడుకోలేదు. అతను తన పాత్రకు తగ్గ న్యాయం చేశాడు. అదిత్‌ అరుణ్‌, నాజర్‌, సంజయ్‌, అనితా చౌదరి అందరూ పెద్దగా నిడివి లేని పాత్రలే చేశారు.

ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి

మైనస్ పాయింట్స్ :
కథ
కథనం

ఓవరాల్‌గా మనసుకు పెద్దగా నచ్చలేదు

Post Your Comments
REVIEW OVERVIEW
SHARE