సిరియాలో మాటలతో చెప్పలేని ఘోరం

0

సిరియాలోని అంతరుధ్యం మరోసారి వికృత రూపం దాల్చింది. ఒక వర్గంపై పట్టుకోసం మరో వర్గం చేసిన దాడిలో 57 మంది చిన్నారులు సహా 200 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే తిరుగుబాటు దారులపై ఆధిపత్యం కోసం సిరియా ప్రభుత్వం దాడులను తీవ్ర తరం చేసింది. తిరుగుబాటు దారులను అణిచివేసే ఏ మార్గాన్ని అక్కడి ప్రభుత్వం వదులోకోవడం లేదు.

ఈ నేపధ్యంలో తిరుగుబాటు దారులు ఎక్కువగా ఉన్నారని భావించిన సిరియాలోని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న తూర్పు గౌటా ప్రాంతంలో తమ పట్టు నిలుపుకునేందుకు సిరియన్‌ బలగాలు వైమానిక దాడులకు పాల్పడుతున్నాయి. వరుసగా మూడురోజుల నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో కనీసం 197 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 57 మంది అభం శుభం ఎరుగని చిన్నారులే ఉన్నారు. దీనిపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. కాగా సోమవారం   ఒక్కరోజే 50 మంది  చిన్నారులు మరణించారు.

Post Your Comments
SHARE