ఎన్నారైలు మీరు ఇది తెలుసుకోండి

0

అమెరికా ప్రభుత్వం ఎన్నారైలకు మరో షాక్ ఇచ్చింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్యోగాలకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మరిన్ని ఇబ్బందులు తప్పవు. తాజాగా అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తెలుసుకుంటే ఇది నిజంగా షాకింగ్ న్యూస్ యే. ఒక టెకీని పనిలోకి తీసుకున్న భారత ఐటీ కంపెనీలు ఇకపై అతని పనికి సంబంధించి అనేక పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితి.

ఇప్పటిలా- ఉద్యోగిని థర్డ్‌పార్టీ వర్క్‌సైట్‌కి పంపినపుడు ఏదో ఒక చిన్న మెయిల్‌ ఇచ్చేసి, ఫలానా చోటకు వెళ్లు అని చెప్పడం కుదరదు.నిర్దిష్ట బాధ్యతలు, అందుకు ఆ వ్యక్తికి ఉన్న అర్హతలు, కంపెనీలో అతని హోదా వంటి పత్రాలెన్నో చూపాలి. పర్యవేక్షణాధికారుల పేర్లు, వివరాలు, బాధ్యతలు, హోదాలు సమర్పించాలి. గురువారం నుంచి అమలులోకి వచ్చిన ఈ విధానం ఇప్పుడు విదేశీలకు గుబులు పుట్టిస్తుంది.

తద్వారా హెచ్‌-1బీ వీసాల సంఖ్యను, గ్రీన్‌కార్డుల జారీని నియంత్రించాలన్నది వ్యూహం.సాధారణంగా ఒక ఉద్యోగి తాలూకు పనిచేసే ప్రదేశం తరుచూ మారుస్తుంటారు, కంపెనీ/క్లయింట్‌ అవసరాలను బట్టి ఇక మీదట అలా పంపేటపుడు అమెరికా ఇమిగ్రేషన్‌ విభాగానికి అన్ని వివరాలతో కూడిన పత్రాలు పంపాలన్నది తాజా నిబంధన.ఈ తాజా రూల్‌ వల్ల టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో లాంటి భారతీయ కంపెనీలు ఇబ్బందిపడతాయి.

ఒక్కసారి వాటిని పరిశీలిస్తే

  •  వేరే చోట్ల ఉద్యోగి పనికి సంబంధించిన ఒప్పందాలు, అక్కడ ఎంతకాలం ఉండాలి అన్నవి సమర్పించాలి.
  •  ఆ ఉద్యోగిని ఏ పని నిమిత్తం అక్కడికి పంపుతున్నారు, సాంకేతిక అర్హతలేంటి అన్నవి పత్రాల రూపంలో తెలపాలి.
  •  అవసరమైన బ్రోచర్లు, ఖర్చుకు సంబంధించిన పత్రాలు ఇవ్వాలి.. సదరు ఉద్యోగికి, పనికి ఎలా డబ్బు సమకూరుస్తారో కూడా తెలపాలి
  •  మైల్‌స్టోన్‌ టేబుల్‌ (అంటే బిజినెస్‌ ప్లాన్‌, బడ్జెట్‌, కాలపరిమితి, యాజమాన్యం బాధ్యతల ప్రణాళిక) ను ఇవ్వాలి.
  •  మార్కెటింగ్‌ అనాలసిస్‌, కాస్ట్‌ బెనిఫిట్‌ అనాలసిస్‌ ఇవ్వాలి. ఉద్యోగి నిర్వర్తించే బాధ్యతలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలి. అతని అర్హతలు, వేతనం, పర్యవేక్షకుడి వివరాలు చెప్పాలి.
  •  వేరే చోట పనికి నియోగించే వ్యక్తికి హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసే వారు- ఆ వ్యక్తి ఓ ప్రత్యేక హోదాతో ఉన్న విషయాన్ని తెలియజెప్పే ఆధారాలు చూపాలి.
  •  అనుమతి ఇచ్చినంతకాలం ఆ ఉద్యోగితో సదరు కంపెనీ సంబంధాన్ని కొనసాగించాలి
  •  వేరే చోటికి పంపే హెచ్‌-1బీ వీసాదారులకు- ప్రత్యేక హోదాలో- నిర్దిష్టమైన, ఊహాజనితం కాని బాధ్యతలున్నాయన్న విషయాన్ని స్పష్టం చేయాలి. తగిన పత్రాలు ఇవ్వాలి.
  •  హెచ్‌-1బీ వీసాను ఇంతవరకూ మూడేళ్ల వరకూ అనుమతిస్తున్నారు. వేరే చోట పనిగనక ముందుగానే అయిపోతే- ఇమిగ్రేషన్‌ విభాగం ఇక ఆ వీసా కాలపరిమితి ముగిసినట్లేనని చెప్పే అవకాశం ఉంటుంది. పరోక్షంగా- ఇది మూడేళ్ల కాలపరిమితికి గండికొట్టే నిబంధన. అలా కాకూడదంటే.. వర్క్‌ పర్మిట్‌ను ఇచ్చే ఆ యాజమాన్యం కచ్చితంగా మూడేళ్ల పాటు సదరు ఉద్యోగి థర్డ్‌ పార్టీ సైట్‌లో పనిచేస్తాడు అని నిరూపించే పత్రాలు ఇవ్వాలి.
Post Your Comments
SHARE