తప్పకుండా ‘తొలిప్రేమ’లో పడాల్సిందే.. రీవ్యూ, రేటింగ్!

0

సినిమా: తొలిప్రేమ
నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
నటీనటులు: వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, నరేష్ త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్రఫీ: జార్జ్ విలియ‌మ్స్‌
నిర్మాత‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి
రేటింగ్: 3.5/5

కెరీర్ ప్రారంభం నుండి డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తున్న మెగా హీరో ‘వరుణ్ తేజ్’. ఈ శుక్రవారం ‘తొలిప్రేమ‌’ సినిమాతో ఫిదా సినిమా తర్వాత వరుణ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఫిదా తర్వాత మళ్లీ ప్రేమకథతో వచ్చిన వరుణ్ ప్రేక్షకులను ఫిదా చేశాడా? లేక నిరాశపరిచాడా తెలుసుకోవాలంటే రీవ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
చదువులో ఎప్పుడూ టాపర్‌గా నిలుస్తుండే వ్యక్తి ఆదిత్య శేఖర్(వరుణ్ తేజ్) ఏదైనా త్వరగా డెసిషన్ తీసుకుంటుంటాడు. అలాగే ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యక్తి వ‌ర్ష (రాశీ ఖ‌న్నా). ఓ రైలు ప్రయాణంలో వర్షను కలిసిన ఆది తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే ట్రైన్ గమ్యం చేరాక ఇద్దరూ విడిపోతారు. అనంతరం వర్ష కోసం ఆది మూడు నెలలు వెతుకుతూనే ఉంటాడు. అయితే ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ కోసం ఒకే కాలేజ్‌లో జాయిన్ అవుతారు. కాలేజిలో ఆదిత్య ప్రేమ‌కు వ‌ర్ష గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. అయితే ప‌రిస్థితులు, కొన్నికారణాల వలన ఇద్దరూ విడిపోతారు. దీంతో ఇద్దరి మధ్య ఆరేళ్ల ఎడబాటు వస్తుంది. ఆది లండన్‌లో చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరతాడు. అయితే ఆది ఏ అమ్మాయికి కూడా కనెక్ట్ కాదు. అందుకు కారణం ఏమిటి? వర్షను మళ్లీ ఆది కలిశాడా? చివరకు వర్ష ఏమైంది? ఆది ప్రేమకథ ఎక్కడ ముగిసింది అనేదే మిగిలిన ‘తొలిప్రేమ’ కథ.

నటీనటులు:
వరుణ్ తేజ్ తనలోని నటనా ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు ప్రేమికుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. వర్ష పాత్రలో రాశిఖన్నా అద్భుతంగా నటించింది. ఎవరైనా ఇటువంటి ప్రేమకథలకు కొత్త ఫేస్‌ను పరిచయం చేస్తే బాగుంటుంది అనుకుంటారు. అయితే బాగా తెలిసిన ఫేస్ అయినా రాశీకన్నా చాలా బాగా నటించింది కొత్త లుక్‌లో అలరించింది. ఇక హీరో ఫ్రెండ్ పాత్రలో ప్రియదర్శి బాగా నటించాడు. హైపర్ ఆది పాత్ర కామెడీ పుట్టించింది. ఇక ఫారిన్‌లో సీనియర్ నటుడు నరేష్, తల్లిగా సుహాసినీ వారి పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.

విశ్లేషణ:
ప్రపంచంలో తొలి ప్రేమ ఏ వ్యక్తికైనా చాలా ప్రత్యకమైనదే. జీవితంలో ప్రేమించిన అందరూ గుర్తుంటారో లేదో తెలియదు కానీ తొలిసారి ప్రేమించిన వ్యక్తి మాత్రం జీవితాంతం గుర్తుంటారు. అటువంటి స్వచ్చమైన ప్రేమ లైన్‌ను దర్శకుడు తీసుకోవడమే తొలి విజయం. ప్రతీ సీన్‌లో ప్రక్షకుడు తమ గత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకునేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. చాలా ఫీల్‌ను క్రియేట్ చేసేలా సన్నివేశాలను తెరకెక్కించాడు. కథను సన్నివేశాలుగా మలిచిన తీరు చాలా బాగుంది. ఏ సన్నివేశంలోనూ క్లారిటీ మిస్ కాలేదు. తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే సెకండాఫ్‌లో కాస్త లాగాడు కొన్ని సన్నివేశాలు అనిపిస్తుంది. కానీ డైలాగులు మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత వినసొంపుగా ఉన్నాయి. ఎమోషన్స్ చాలా న్యాచురల్‌గా అనిపించాయి. అయితే క్లైమాక్స్ ఎపిసోడ్ పెద్దగా ఇంప్రెస్ చేయదు. కానీ అంతకుమించి పెట్టే పరిధి కూడా లేదు.

టెక్నికల్‌గా:
సినిమాకి మేజర్‌గా సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరింది. అలాగే తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలకు కొరియోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. చిన్నపాటి తప్పులు అక్కడక్కడా జరిగినప్పటికీ సినిమాలో ఎక్కడా ఫీల్ అయితే మిస్ కానివ్వకుండా సాంకేతిక విభాగం పనిచేసింది.

బ‌లాలు:
కథ, కథనం, మాటలు, దర్శకత్వం
న‌టీనటులు
సినిమాటోగ్ర‌ఫీ
సంగీతం

బ‌ల‌హీన‌త‌లు:
క్లైమాక్స్‌
సెకండాఫ్‌‌లో కాస్త సాగదీత

ఓవరాల్‌గా ఫీల్ గుడ్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్లదగిన సినిమా..!

Post Your Comments