మరోసారి మోడీ మాదిరి ట్రై చేసిన ట్రంప్

0

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడిని అనుకరించే ప్రయత్నం చేసారు. వివరాల్లోకి వెళితే భారత్ ఇటీవల హార్లి డేవిడ్ సన్ బైక్స్ పై పన్ను తగ్గించారు. దీనిపై ట్రంప్ ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు.  వైట్‌హౌస్‌లో జరిగిన రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో పాల్గొన్న ట్రంప్ మోడీపై  వ్యాఖ్యలు చేసారు.  ‘‘ మోదీ అందమైన వ్యక్తి.. అధ్బుతమైన వ్యక్తి..

హ్యర్లీ డేవిడ్ సన్ బైకుల దిగుమతిపై ఉన్న 100 శాతం సుంకాన్ని 50 శాతానికి తగ్గించామని మోదీ నాకు ఫోన్ చేసి చెప్పారు.కానీ ఏం ప్రయోజనం.. భారత్ ఎగుమతి చేస్తున్న వాహనాలపై అమెరికాలో ఎలాంటి పన్ను లేదు.. కానీ భారత్ మాత్రం అమెరికా వస్తువులకు భారీగా పన్ను వేస్తోంది.. మోదీ చెప్పిన మాటలకు నేను సంతోషించాలా..? నేను ఆశ్చర్యపోవాలా?’’ అని గవర్నర్లతో అన్నారు. అలాగే ఇదే సమయంలో మోడిని అనుకరించే ప్రయత్నం చేసారు ట్రంప్.. రెండు చేతులు జోడించిన ట్రంప్.. ప్రధాని మోదీని అనుకరించే ప్రయత్నం చేశారు.

Post Your Comments
SHARE