అరుదైన రికార్డ్ కోహ్లి సొంతం

0

టీం ఇండియా సారధి విరాట్ కోహ్లి మరో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఒంటిచేత్తో టీంకి వన్డే సీరీస్ అందించిన విరాట్ కోహ్లి విదేశాల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో చేరిపోయాడు. మూడు ఫార్మాట్లలో 14 ఇన్నింగ్స్‌ల ద్వారా కోహ్లీ  871 పరుగులు చేసాడు. వీటిల్లో నాలుగు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. దీంతో కోహ్లీ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ అలెన్‌ బోర్డర్‌ రికార్డును అధిగమించాడు.

1985లో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన ఆసీస్‌ జట్టుకు నాయకత్వం వహించిన బోర్డర్‌ 14 ఇన్నింగ్స్‌ల ద్వారా 785 పరుగులు సాధించాడు.దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్‌ స్మిత్‌ 2003లో ఇంగ్లాండ్‌ పర్యటనలో 16 ఇన్నింగ్స్‌ల ద్వారా 937 పరుగులు సాధించి.. విదేశీ పర్యటనల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా . కోహ్లీ(14 ఇన్నింగ్స్‌లు, 871 పరుగులు)రెండో స్థానంలో , బోర్డర్‌(14 ఇన్నింగ్స్‌లు, 785 పరుగులు)మూడో స్థానంలో , అలెస్టర్‌ కుక్‌(13 ఇన్నింగ్స్‌లు, 769 పరుగులు)నాలుగో స్థానంలో ఉన్నారు.

Post Your Comments
SHARE